ఈరోజు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మీద షాక్ కి గురి చేసే కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్. దెబ్బకి అందరు షాక్ గోల గోల చేసారు

ఈరోజు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మీద షాక్ కి గురి చేసే కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్. దెబ్బకి అందరు షాక్ గోల గోల చేసారు 
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై ఆయన స్పందించారు.పరకాల ప్రభాకర్‌పై విమర్శలు చేశారు. విపక్షం అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఏమిటి అని వైసిపి అధినేత జగన్‌కు చెప్పారు. పీఆర్పీలో నిస్వార్థపరులు ఉంటే చిరంజీవి సీఎంగా ఉండేవారన్నారు. తాను చిరంజీవిలా మంచివ్యక్తిని కాదని చెప్పారు. అలాగే కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పనులు చేయించవచ్చునని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రి కావడమే రాజకీయ లక్ష్యం కాదన్నారు. సామాజిక మార్పు తేవడమే అసలైన రాజకీయం అని చెప్పారు. అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చునని, ఊపిరి ఆడకుండా చేయవచ్చునని చెప్పారు. హామీలను ఇచ్చి నెరవేర్చనప్పుడు ప్రజల తరఫున గళం విప్పుతానని చెప్పారు. ప్రభుత్వంతో పని చేయించడమే అసలు రాజకీయం అన్నారు. కులాలు సామాజిక సత్యం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాజిక సత్యాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. అంబేడ్కర్‌ను నిజంగా గౌరవిస్తే కులాలను రాజకీయాల నుంచి తీసివేయాలన్నారు. కులాలను గౌరవిస్తాను కానీ కులాలను వెనుకేసుకు రానని, ఇదే జనసేన సిద్ధాంతమని చెప్పారు. కులం అనేది ఒక అంశం, ఒక భ్రమ అన్నారు. దేశంలో కుల రాజకీయాలు సర్వ సాధారణం అయ్యాయని చెప్పారు. తాను గతంలో రాజధాని పర్యటనకు వెళ్తుంటే తనచుట్టూ కాపు యువత ఉందని తప్పుడు కథనాలు రాశారన్నారు.


Comments