వార్నింగ్ ఇస్తే ముద్దు పెట్టిన RGV | దెబ్బకి టీవీ 9 యాంకర్ కూడా నవ్వేసాడు, నిన్న రాత్రి అదిరిపోయే లైవ్ ఇంటర్వ్యూ

వార్నింగ్ ఇస్తే ముద్దు పెట్టిన RGV | దెబ్బకి టీవీ 9 యాంకర్ కూడా నవ్వేసాడు, నిన్న రాత్రి అదిరిపోయే లైవ్ ఇంటర్వ్యూ 
రామ్ గోపాల్ వర్మ అంటే... సినిమాల కంటే కూడా వివాదాలే ఎక్కువ గుర్తుకొస్తాయి. తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే ఈ స్టార్ డైరెక్టర్ తన తాజా వెబ్ సిరీస్ 'కడప' ద్వారా రాయలసీమ ప్రజలు రగిలిపోయేలా చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందే అంటూ ఆగ్రహంగా ఉన్న అక్కడి వారు... ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ ప్రాంతంలో ఇపుడు ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టింది. ఒకప్పటి లాంటి దారుణమైన పరిస్థితులు మాత్రం లేవు.
అయితే ప్రజలు ఆ చీకటి అధ్యాయం గురించి గురించి మరిచిపోతున్న తరుణంలో.... వర్మ ‘కడప' పేరుతో వెబ్ సిరీస్ తేవడం, అందులో పలు దారుణమైన సన్నివేశాలు చూపించడంతో అంతా షాకయ్యారు. తాను అనుకున్నది వెండి తెర‌పైన చూపించ‌డానికి సెన్సార్ బోర్డు అడ్డు వ‌స్తుంద‌ని భావించిన వ‌ర్మ..... ఎవరూ ఆపడానికి వీల్లేని డిజిట‌ల్ మీడియాని ఎంచుకున్నాడు. ‘కడప' వెబ్ సిరీస్‌లో ఇందులో బోల్డ్ కంటెంట్‌తో పాటు ఫ్యాక్ష‌నిజం, బూతు ప‌దాలు కూడా వాడటం గమనార్హం. ప్రశాంతగా ఉన్న రాయలసీమను ఫ్యాక్షన్ అడ్డాగా చూపిస్తూ సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, రామ్ గోపాల్ వర్మ వెంటనే అరెస్ట్ చేయాలని రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అనంత‌పురం త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ మేరకు రాయలసీమ విమోచన సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయకపోతే కోర్టులో పిల్ దాఖలు చేయడానికైనా సిద్ధమే అన్నారు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో? చూడాలి.

Comments