నీకు వస్తే నువ్వు సినిమా తీసి చూపించు | రివ్యూ లు ఇచ్చే వాళ్ళని, తనని తిట్టగానే కత్తి మహేష్ షాక్ అయ్యాడు

నీకు వస్తే నువ్వు సినిమా తీసి చూపించు | రివ్యూ లు ఇచ్చే వాళ్ళని, తనని తిట్టగానే కత్తి మహేష్ షాక్ అయ్యాడు
విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నాననే ప్రకటనపై స్పందిస్తూ.. పవన్ కల్యాణ్‌పై మరో అస్త్రం ప్రయోగించాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌ అంటే నరికేస్తాం.. చంపేస్తాం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా కత్తి మహేష్ ఎక్కడా తగ్గడం లేదు. 
సమయం దొరికిన ప్రతిసారి పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. తాజాగా కత్తి మహేష్ చేసిన పోస్ట్ చూస్తే పవన్ కల్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో మరి?సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రకటన చేస్తూ ఎందుకు వస్తున్నది క్లియర్‌గా చెప్పారు. ‘‘కొత్త పార్టీ పెట్టి.. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ పోటీ చేస్తాను. డబ్బు కోసమో.. పదవి కోసమో అయితే రాజకీయాల్లోకి రావడం లేదు. ప్రజలకి రక్షణ కల్పించేందుకే వస్తున్నా. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారు’’ అని ప్రసంగించిన విషయం తెలిసిందే.


Comments