క్రికెట్ బెట్టింగ్ అంటే పిచ్చి ఉన్నవాళ్లు తప్పక చుడండి | ఈ వీడియో చూస్తే ఇంకా లైఫ్ లో బెట్టింగ్ కి పోరు

క్రికెట్ బెట్టింగ్ అంటే పిచ్చి ఉన్నవాళ్లు తప్పక చుడండి | ఈ వీడియో చూస్తే ఇంకా లైఫ్ లో బెట్టింగ్ కి పోరు 
ఈ షార్ట్ ఫిల్మ్ చూసే ముందు నిన్న కరీంనగర్ లో జరిగిన ఘటన.కరీంనగర్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మంది సభ్యులు గల ముఠాలో ఏడుగురిని టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ. 45,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ జట్ల మధ్య జరిగే వన్డే, 20-20, ఐపీఎల్ వంటి మ్యాచ్‌ల సమయంలో ఈ ముఠా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు. కరీంనగర్ కాపువాడకు చెందిన మహ్మద్ సిరాజ్, బొమ్మరాజు సంతోశ్, రాచకొండ సురేశ్, అశోక్‌నగర్‌కు చెందిన రాహుల్, పద్మనగర్‌కు చెందిన సాయి ప్రసాద్, భగత్‌నగర్‌కు చెందిన గంగిపల్లి సాయికృష్ణ, కందుకూరి సంతోశ్ ముఠాగా ఏర్పడ్డారు.
వెబ్‌సైట్లలో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి సమాచారం తెలుసుకొని ఓ ప్రదేశాన్ని ఎంచుకొని ఫోన్ల ద్వారా బెట్టింగ్ సమాచారం పొందుతూ పర్సంటేజీలు నిర్ణయించి డబ్బులు దండుకునే వారు. వచ్చిన లాభాల్లో సమాన నిష్పత్తిలో పంచుకుంటూ అదే సమయంలో బెట్టింగ్ సమాచారం యువతకు చేరేలా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా శ్రీలంక-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌పైనా బెట్టింగ్ నిర్వహించి సాయంత్రం అందుకు సంబంధించిన డబ్బులు తీసుకుంటుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు. 8 మంది సభ్యుల ముఠాలో ఏడుగురు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు కిరణ్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు నిజ జీవితం లో జరిగిన ఘటన వీడియో రూపం లో...

Comments