వీడియో : నిన్న మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ ని భయపెట్టిన ధోని | ప్రాణం పోయేది అని చెప్పిన రాహుల్, నవ్వినా ధోని

వీడియో : నిన్న మ్యాచ్ లో కె ఎల్ రాహుల్ ని భయపెట్టిన ధోని | ప్రాణం పోయేది అని చెప్పిన రాహుల్, నవ్వినా ధోని 
శ్రీలంకతో జరిగిన తొలి టీ 20లో టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌ టీ20 చరిత్రలో అతి పెద్ద విజయాన్ని సాధించి కొత్త రికార్డు నమోదు చేసింది. అయితే ఈ భారీ విజయంలో కేఎల్‌ రాహుల్‌(61;48 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(39 నాటౌట్‌;22 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్‌)లు కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రాణించడంతో తొలుత భారత జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగుల చేయగా, ఆపై లంకేయులు 87 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూశారు.అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ను నిర్మించే క్రమంలో ధోని కొట్టిన ఓ షాట్‌ తనను చంపేసినంత పని చేసిందని మ్యాచ్‌ అనంతరం కేఎల్‌ రాహుల్‌ వ్యాఖ్యానించాడు. 'ధోని స్టైట్‌గా కొట్టిన ఒక షాట్‌ను నేను తృటిలో తప్పించుకున్నా. దాన్ని తప్పించుకోలేకపోయినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగేది. ఆ షాట్‌ నన్ను చంపినంత పని చేసింది.దాన్ని తప్పించుకునే క్రమంలో చాలా భయపడ్డా' అని రాహుల్‌ వ్యాఖ్యానించాడు. లంక స్సిన్నర్‌ ధనంజయ వేసిన 14 ఓవర్‌ మూడో బంతిని ధోని ఎటువంటి తడబాటు లేకుండా భారీ షాట్‌ కొట్టాడు. అది నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో ఉన్న రాహుల్‌వైపు రాకెట్‌ వేగంతో వచ్చి ఆపై బౌండరీకి దూసుకుపోయింది. ఆ షాట్‌ గమనాన్ని వేగంగా అంచనా వేసిన రాహుల్‌ చాకచక్యంగా తప్పించుకున్నాడు.  ఈ క్రమంలోనే ఆ షాట్‌ గురించి మాట్లాడిన రాహుల్‌..  ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.'ధోని మంచి టచ్‌లో ఉన్నాడు. ఇటీవల కాలంలో అతని ఫామ్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను ధోనితో ఎప్పుడు ఆడినా అతను పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. టీవీల్లో మ్యాచ్‌లు చూసినప్పుడు కూడా సునాయాసంగా పరుగుల్ని రాబడుతున్నాడు. చివరిసారి ధోనితో ఆడినప్పుడు అతను భారీ సెంచరీ చేశాడు. అలానే ప్రతీ గేమ్‌లో అతని పాత్ర స్పష్టంగా కనబడుతుంది. యువ క్రికెటర్లకు మంచి సలహాలు ఇస్తూ మాకు అండగా ఉంటాడు. అతనొక మ్యాచ్‌ విన్నర్‌' అని రాహుల్‌ కొనియాడాడు.

Comments