ఈరోజు విజయ్ సాయి పర్సనల్ వీడియో బయటపెట్టిన భార్య వనిత | పాపం తన పర్సనల్ వీడియో ని బయటపెట్టింది

ఈరోజు విజయ్ సాయి పర్సనల్ వీడియో బయటపెట్టిన భార్య వనిత | పాపం తన పర్సనల్ వీడియో ని బయటపెట్టింది 
విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ ఇచ్చింది ఆమె భార్య వనితా రెడ్డి. విజయ్ నిజ స్వరూపం ఇదిగో అంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ.. విజయ్ సాయి మరో యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను విడుదల చేసింది. తాను ఎక్కడికీ పారిపోలేదని.. విజయ్ సాయి చేసిన అరాచకాలను బహిర్గతం చేసేందుకు సాక్ష్యాలను రాబట్టే పనిలో ఉన్నానని, త్వరలోనే పోలీసులకు లొంగిపోతా అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది వనితా రెడ్డి.నేను తప్పుచేయలేదు. నా బిడ్డ భవిష్యత్ కోసమే ఇలా పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతన్నానని ఈ విషయంలో పోలీసులు క్షమించాలన్నారు. తనపై వస్తున్న ఆరోపణలనుండి పూర్తిగా బయటపడతానని, తన వల్లే విజయ్ సాయి చనిపోయాడనేది పూర్తిగా అవాస్తవం అన్నారు. విజయ్ సాయిని తాను డబ్బుకోసం డిమాండ్ చేశాననటం కరెక్ట్ కాదని.. నాకు సంబంధించిన ఆస్తులు విజయ్ సాయి దగ్గర ఉన్నాయన్నారు. త్వరలో అన్ని విషయాలు బహిర్గతం అవుతాయంటున్నారు వనితా రెడ్డి.అయితే ప్రస్తుతం సంచలనంగా మారిన విజయ్ సాయి రాసలీలల ఫోటోలు మార్ఫింగ్ చేసినవి అని..
వాటిని ఇంతకు ముందు వనితా రెడ్డి కోర్టులో కూడా సమర్పించిందంటున్నారు విజయ్ సాయి తండ్రి. ఆమె విడుదల చేసిన ఫోటోలు నిజమే అయితే ఆ ఫోటోలో ఉన్న యువతి ఎవరో చెప్పాలంటున్నారాయన. వనితా రెడ్డి నాటకంలో భాగంగానే ఈ నాటంకం ఆడుతుందన్నారు. నేను విజయ్ సాయి దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేయలేదు.. వాళ్ల ఇంట్లోనే నా డబ్బులు ఉన్నాయంటున్న వనితకు అసలు డబ్బు ఎలా సంపాదించిందో చెప్పాలంటున్నారు.అయితే పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న వనితా రెడ్దిని ఇంకా అరెస్ట్ చేయలేకపోవడం అసంత్రుప్తి వ్యక్తం చేశారు విజయ్ తండ్రి. వనితా రెడ్డి పంపే ఫోటోలు వీడియోలను సేకరిస్తున్న పోలీసులు, ఆమె ఎక్కడుందో కనుక్కోలేరా అంటూ ప్రశ్నించారాయన. ఫైనల్‌గా తన కొడుకు చివరి కోరికను తీర్చడం తన బాధ్యత అని.. నా మనవరాలు కుందనను వనితా రెడ్డి నుండి తీసుకువచ్చేందుకు పోలీసులు సహాయం చేయాలని కోరుకుంటున్నారు విజయ్ సాయి తండ్రి.




Comments