రోజా కి అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్ | టీవీ 9 యాంకర్ కి మైండ్ పోయింది | ప్రాణం పోయిన సారీ చెప్పను

రోజా కి అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్ | టీవీ 9 యాంకర్ కి మైండ్ పోయింది | ప్రాణం పోయిన సారీ చెప్పను 
రోజా-బండ్ల గణేష్ మధ్య వివాదం మరింత ముదిరింది. రోజా వర్సెస్ బండ్ల గణేష్ వివాదం కాస్త.. వైసీపీ వర్సెస్ జనసేన వివాదంగా మారింది. ఇటీవల ఓ టీవీ చానల్ డిబేట్‌లో పరస్పరం దూషించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను అరెస్టు చేయాలని కోరుతూ విజయవాడలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లు సీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా.. తాజా వివాదంపై మరోసారి స్పందించారు బండ్లగణేష్.
 పవన్ కళ్యాణ్ అంటే తనకు దేవుడితో సమానం అని.. అలాంటి దేవుడ్ని నా ముందే దూషిస్తే ఊరుకోనన్నారు. రోజాపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోనన్నారు. రోజా పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పితే.. ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమే అన్నారు. రోజా నోరు జారినందుకే నేనూ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని... మచ్చ లేని చంద్రుడు పవన్‌పై అసత్య ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోయా అన్నారు. రోజాతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు... పవన్ కళ్యాణ్‌ను విమర్శించింనందుకే నేను విమర్శించా అన్నారు. ఇక తనపై గతంలో వచ్చిన ఆరోపణలన్నీ నిజం కాదని.. తాను తప్పుచేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తానన్నారు.



Comments