వీడియో : నిన్న విరాట్ కోహ్లీ తన DRS తో షాక్ ఇచ్చాడు శ్రీ లంక కి : జడేజా అయితే నవ్వుతూనే ఉన్నాడు

వీడియో : నిన్న విరాట్ కోహ్లీ తన DRS తో షాక్ ఇచ్చాడు శ్రీ లంక కి : జడేజా అయితే నవ్వుతూనే ఉన్నాడు
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బౌలర్లు శ్రీలంకను గట్టిగా దెబ్బ కొట్టారు. ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా పడగొట్టేశారు. శుక్రవారం ఇక్కడ మొదలైన రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు), కెప్టెన్‌ చండిమాల్‌ (122 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్‌ ఇషాంత్‌ (3/37) టాపార్డర్‌ను కూలిస్తే స్పిన్నర్లు అశ్విన్‌ (4/67), రవీంద్ర జడేజా (3/56) మిగతా బ్యాట్స్‌మెన్‌ పనిపట్టారు.  తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది.
మురళీ విజయ్‌ (2 బ్యాటింగ్‌), పుజారా (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ (7)ను గమగే బౌల్డ్‌ చేశాడు. టాస్‌ నెగ్గిన లంక బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు సమరవిక్రమ (13), కరుణరత్నే పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. అదే పనిగా బంతుల్ని డిఫెన్స్‌గా ఆడిన ఈ జోడీ స్కోరుపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే ఈ అతి జాగ్రత్త ఎంతోసేపు కాపాడలేకపోయింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఇషాంత్‌ బౌలింగ్‌లో సమరవిక్రమ, స్లిప్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన తిరిమన్నే (58 బంతుల్లో 9) కూడా జిడ్డుగా ఆడి చివరకు అశ్విన్‌ ఓవర్లో క్లీన్‌ బౌల్డయ్యాడు. శ్రీలంక 47/2 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.

Comments