ఈ వీడియో చూసాక 'లవ్ మ్యారేజ్' చేసుకోవాలి అంటే భయపడతారు | మరి ఇలా చేస్తే ఇంకా లవ్ కూడా చేయరు ఎవరు

ఈ వీడియో చూసాక 'లవ్ మ్యారేజ్' చేసుకోవాలి అంటే భయపడతారు | మరి ఇలా చేస్తే ఇంకా లవ్ కూడా చేయరు ఎవరు 
మన దేశంలో ఉగ్రవాద చర్యల కన్నా ఎక్కువగా మనుషులు ప్రేమ సంబంధ వ్యవహారాలతో మరణిస్తున్నారు అని 2001 -2015 మధ్య దేశంలోని అసహజ మరణాలను నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో లెక్కలు చూసిన అతుల్‌ ఠాకూర్‌ టైమ్స్‌ ఇండియా హైదెరాబాద్‌ ఎడిషన్‌లో ఏప్రిల్‌ రెండు 2017న రిపోర్ట్‌ రాసాడు. పైన చెప్పిన కాలంలో రోజుకు సగటున ఏడు హత్యలు, పద్నాలుగు ఆత్మహత్యలు, నలభై ఏడు కిడ్నాపులు ప్రేమ సంబంధం గలవిగా రిపోర్ట్‌ అవుతున్నాయి. ఉగ్రవాదానికి ఈ పద్నాలుగు ఏండ్లలో 20వేల మంది బలి కాగా, 39వేల హత్యలు. 79వేల ఆత్మహత్యలూ, 2,60వేల కిడ్నాప్‌లు ప్రేమ పేరిట జరిగినాయి అన్నది రిపోర్టు సారాంశం. కొంచం తరిచి చూస్తే ఈ మరణాల వెనుక వర్ణ కుల ( కొన్నిసార్లు మతం) ఆధిపత్య మే బయట పడుతుంది.
 

కుల మత 'పవిత్రతలను' కాపాడే కార్యాచరణ ఎంత అమానుషంగా మారిందో మనకు అర్థం అవుతుంది. వర్ణ కుల వ్యవస్థ పవిత్రతకూ పటిష్టతకూ, వర్ణంలోని కులంలోనే పెండ్లి జరగడానికీ మధ్య ఉన్న లంకె అత్యంత కీలక మైనది. వర్ణ కుల సంబంధాల పునరుత్పత్తికి కులం దాటని పెండ్లి ఒక ప్రధాన సాధనం(మతం విషయం లో కూడా ఇదే సూత్రం నిజం). దీనితో కులంలోని ఆడ పిల్లలు కులం బయట సంబంధాలు ఎట్టి పరిస్థితులలో కల్పించు కోకుండా చూసే వర్ణ కుల పిత స్వామ్యం ఒకటి మన దేశంలో బలంగా రూపొంది ఉన్నది. ఆ వ్యవస్థ ఆడపిల్లను ఆస్తిగా భావిస్తుంది, ప్రధానంగా వేరే కులపు మొగపిల్లల నుండి రక్షించుకోవలసిన ఆస్తిగా ఆడపిల్ల భావించ బడుతుంది. ఈ స్థితీ వల్లనే ప్రేమ మన దేశంలో ఇన్ని చావులకూ 'అపహరణ' రిపోర్ట్లకూ కారణం అవుతున్నది. ఈ మంథని మధుకర్‌ అసహజ మరణం.


Comments