ఇండియా గెలిచినా కప్పు తీసుకోడానికి నిరాకరించిన కెప్టెన్ ధోని, తీసుకోకుండా ఎం చేసాడో చుడండి
సరిగ్గా 30 ఏళ్ల కిందట చెన్నైలో భారత జట్టు అరుదైన విజయాన్ని సాధించే అవకాశాన్ని కొద్దిలో పోగొట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అలెన్ బోర్డర్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 574 పరుగుల భారీ స్కోరు సాధించగా.. కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు 397 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 170/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 347 పరుగులు సాధించాల్సిన పరిస్థితి. గావస్కర్ 90 పరుగులు, అమర్‌నాథ్ 51 రన్స్ చేయడంతో టీమిండియా దీటుగా బదులిచ్చింది. రవిశాస్త్రి, చేతన్ శర్మ రాణించడంతో.. టీమిండియా విజయం దిశగా సాగింది.
భారత్ ఓ దశలో 331/7తో పటిష్టంగా కనిపించింది. మరో 17 పరుగులు చేస్తే కపిల్ సేన రికార్డు నెలకొల్పడం ఖాయం. కానీ చివర్లో ఆసీస్ బౌలర్ బ్రైట్ మూడు వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్.. ఆఖరి రెండు బంతులు.. ఒక వికెట్ చేతిలో ఉండగా.. ఒక్క పరుగు చేస్తే విజయం భారత్‌దే. రవిశాస్త్రి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండగా, చివరి బ్యాట్స్‌మెన్ మణిందర్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే భారత్ కొంప ముంచింది. ఏడు బంతులను బాగానే ఎదుర్కొన్న మణిందర్ తడబడ్డాడు. ఆసీస్ బౌలర్ గ్రేగ్ మాథ్యూస్ విసిరిన బంతి అతడి ప్యాడ్‌లను తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. దీంతో భారత్ సరిగ్గా 347 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ టైగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌తో 119 పరుగులు సాధించిన కపిల్ దేవ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడం భారత్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. లేదంటే 30 ఏళ్ల కిందటే భారత్ చరిత్ర సృష్టించేది. ఇప్పటి వరకూ ఆసియాలో ఏ జట్టు కూడా 500 పరుగులకుపైగా స్కోరును చేధించి విజయం సాధించలేదు.


Comments
Post a Comment