హలో టీజర్ మ్యూజిక్ కాపీ కొట్టి దొరికిపోయిన అనూప్ రూబెన్స్ | ఇంత దారుణం గా ఎవరు కాపీ చేయలేదు ఇప్పటిదాకా

హలో టీజర్ మ్యూజిక్ కాపీ కొట్టి దొరికిపోయిన అనూప్ రూబెన్స్ | ఇంత దారుణం గా ఎవరు కాపీ చేయలేదు ఇప్పటిదాకా 
అఖిల్ అక్కినేనికి నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. తన ‘హలో’ మూవీని వచ్చే నెల 22న సోలోగా విడుదల చేయాలి అనుకుంటే ఆసినిమాకు ఊహించని భారీ పోటీ ఎదురౌతోంది. ఇలాంటి పరిస్థుతులలో ‘హలో’కు ఊహించని షాక్ తగిలింది. ఆ మధ్య విడుదలైన ‘హలో’ టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి.
 అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు. ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది. ఆ మ్యూజిక్ సొంత హక్కు దారులు వారే ఫిన్‌లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేస్తుంది. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు. విషయం తెలిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చర్యలు చేపట్టారు. కాపీ రైట్ ఉన్న ఆ మ్యూజిక్ హక్కులు కొని… తిరిగి టీజర్ అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ‘హలో’ చిత్ర యూనిట్‌కు ఇది ఊహించని చేదు అనుభవమే.


Comments