బండ్ల గణేష్ మెడ మీదా కత్తి పెట్టి కామెడీ చేసిన పవన్ కళ్యాణ్ | కాటంరాయుడు చూడని మేకింగ్ సీన్స్ వైరల్

బండ్ల గణేష్ మెడ మీదా కత్తి పెట్టి కామెడీ చేసిన పవన్ కళ్యాణ్ | కాటమరాయుడు చూడని మేకింగ్ సీన్స్ వైరల్ 
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్, స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. భారీ అంచనాలతో గతేడాది వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకోవడం అభిమానులను జీర్ణించుకోలేకపోయారు. తాజాగా అభిమానులను మెప్పించేందుకు పవన్ కల్యాణ్ కాటమరాయుడు అవతారం ఎత్తాడు. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్ చిత్రానికి రీమేక్.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో శ్రుతిహాసన్ రెండోసారి జతకట్టింది. ఇప్పటివరకు తమ్ముడి ఇమేజ్‌ ఉన్న పవన్ కల్యాణ్ తొలిసారిగా అన్నయ్యగా కనిపించనున్నారు. అన్నదమ్ముల అనుబంధం, లవ్, కామెడీ, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌, పవర్ ఫుల్ డైలాగ్స్ దట్టించిన కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Comments