సుధీర్,రేష్మి మొత్తం కొట్టుకున్న ( వీడియో ) : ఏంటి నీకు నొప్పి, నా దగ్గర కాదు నీ వేషాలు - సుధీర్

సుధీర్,రేష్మి మొత్తం కొట్టుకున్న ( వీడియో ) : ఏంటి నీకు నొప్పి, నా దగ్గర కాదు నీ వేషాలు - సుధీర్ 
నేను విశాఖలోనే సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే సుడిగాలి సుధీర్ అంటున్నారు. ఎటొచ్చీ మళ్లీ సుడిగాలి దగ్గరే ఆగుతున్నారు. ఆమధ్య కూడా జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి.
అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. ఈ అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు.తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు.



Comments