రైలు దిగుదాము అని ప్రాణాలమీదకు తెచ్చుకుంది | ఇలా ఇంత వరకు ఏ అమ్మాయికి కి జరగలేదు

రైలు దిగుదాము అని ప్రాణాలమీదకు తెచ్చుకుంది | ఇలా ఇంత వరకు ఏ అమ్మాయికి కి జరగలేదు 
రైల్వేబోర్డు చైర్మన్ రాజీనామా చేసినా ఆగలేదు.. ఏకంగా మంత్రిగారి శాఖను మార్చినా ప్రయోజనం కనిపించలేదు. రైళ్లు పట్టాలు తప్పుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతికంగా ఎంత ముందడుగు వేసినా, ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రగతి చూపిం చలేకపోతున్నాము. విద్రోహచర్యలే కారణం అవుతున్నాయో, పట్టాల నిర్వహణలో వైఫల్యమే దారితీస్తోందో గానీ ప్రమాదాలు మాత్రం వరుసపెట్టి సంభవిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రమాదాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది.
 ఒకవైపు ఆస్పత్రులలో మరణాలు, మరోవైపు రైలు ప్రమాదాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో వరుసపెట్టి నాలుగు రోజుల్లోనే రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించగా, తాజాగా గురువారం మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా-జబల్ పూర్ మధ్య నడిచే శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుఝామున ఒబ్రా రైల్వే స్టేషన్ వద్ద రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Comments