వికెట్ మీద పడకుండా తప్పించుకుందాం అని కిందపడి కామెడీ చేసాడు బంగ్లా బ్యాట్స్ మాన్ | ధోని కూడా రియాక్ట్ అయ్యాడు

వికెట్ మీద పడకుండా తప్పించుకుందాం అని కిందపడి కామెడీ చేసాడు బంగ్లా బ్యాట్స్ మాన్ | ధోని కూడా రియాక్ట్ అయ్యాడు 

బంగ్లాదేశ్‌ని వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి వన్డే‌లో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. కెప్టెన్ డుప్లెసిస్ (91 రిటైర్డ్ హర్ట్ : 67 బంతుల్లో 10x4, 1x6), ఓపెనర్ డికాక్ (73: 68 బంతుల్లో 9x4, 1x6) దూకుడుగా ఆడటంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఘోరంగా తడబడింది. ఓపెనర్లు ఇమ్రూల్ ఖయ్యూస్ (1), సౌమ్య సర్కార్ (8) విఫలమవగా.. మిడిలార్డర్‌ లిటన్ దాస్ (6), ముష్ఫకర్ రహీమ్ (8), మమ్మదుల్లా (2) వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు 61/5తో ఓటమికి చేరువైంది. అయితే.. మధ్య ఓవర్లలో షబ్బీర్ రెహ్మాన్ (39)‌తో కలిసి షకీబ్ అల్ హసన్ (63: 82 బంతుల్లో 8x4) కీలక ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఔటవగా.. బంగ్లాదేశ్ పతనం మరింత వేగంగా సాగింది. చివరికి ఆ జట్టు 40.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గురువారం జరగనుంది.



Comments