హ హ టీవీ 9 ఎలా ఉందొ చుపించిన పవన్ కళ్యాణ్. హైపర్ ఆది కి ఈ వీడియో చూపించాలి, మాములుగా లేదు.

హ హ టీవీ 9 ఎలా ఉందొ చుపించిన పవన్ కళ్యాణ్. హైపర్ ఆది కి ఈ వీడియో చూపించాలి, మాములుగా లేదు. 
జబర్దస్త్ కామెడీ షో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. గతంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా చూపించారని కరీంనగర్‌లో కేసు నమోదు కాగా.. భారతీయ న్యాయవ్యవస్థను అవమానించారంటూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని అంగీకరించిన కోర్టు.. జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాలు జబర్దస్త్‌ను చుట్టుముట్టాయి.
 కాగా మరోసారి జబర్దస్త్ కామెడీ షో ప్రదర్శించిన స్కిట్‌ ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు అనాథబాలలు.ఇటీవల ప్రదర్శించిన జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది అనాథలపై దారుణమైన జోక్స్ వేయడం వివాదానికి కారణమైంది. ‘జబర్దస్త్ ఆడియన్స్.. ఊపిరి పీల్చుకోండి.. ఆది వస్తున్నాడు అంటూ యాంకర్ అనసూయ ఓ రేంజ్‌లో హైపర్ ఆదికి, రైజింగ్ రాజుకి వెళ్కమ్ చెప్పేయడంతో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. అనాథలను కించపరిచే జోక్స్ వేశారు. ‘నన్ను చిన్నప్పుడు చెత్త కుండీలో పడేశారని అనాథ పాత్రధారిగా ఉన్న రైజింగ్ రాజు అంటే.. నీ లాంటి వాడిని చెత్త కుండీలో కాకుండా తిరుపతి హుండీలో వేస్తారా.. వీళ్లు అనాథల్లా లేరు.. పదికీ పాతికకు పీకలు కోసేలా ఉన్నారు వీళ్లు అనాథలు ఏంటి?

ఇంతకీ అనాథలు అంటే ఏమిటో తెలుసా.. అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ.. అనాథలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అనాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా స్కిట్ చేసిన జబర్దస్త్ కామెడీ షోపైన హైపర్ ఆదిపైన చర్యలు తీసుకోవాలంటే అనాథ యువతులు సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి, కొంత మంది అనాథ పిల్లలు కలిసి వివాదాస్పద కామెడీ షో ‘జబర్దస్త్’పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.


Comments