టీవీ 9 డిలీట్ చేసిన వీడియో : నా సినిమా ఠాగూర్ దొబ్బేసాడు చిరు | ప్రజారాజ్యం పార్టీ అమ్మేస్తాడు చూడండి

రాజకీయాల్లో మాదిరిగానే సినిమారంగంలో కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల మనస్పర్ధలు తలెత్తి దూరమైన వాళ్ళు మళ్ళీ కలుసుకున్న సందర్భాలున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ దంపతుల మధ్య స్నేహం చిగురించింది. ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళితే…. చిరంజీవి పార్టీ పెట్టకముందు రాజశేఖర్ చేసిన కామెంట్స్ వివాదమయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై చిరు అభిమానులు దాడి చేశారు. దాంతో రాజశేఖర్, జీవిత తీవ్రంగా ఆగ్రహించారు. చిరంజీవిపై విమర్శల దాడి చేశారు. అదే సందర్భంలో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి పలకరించారు
అయినప్పటికీ వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. రాజశేఖర్, జీవిత వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పొసగక కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో దారుమంగా ఓడిపోవడంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దాంతో రాజశేఖర్ మళ్లి పార్టీ మారి భాజాపాలో చేరారు. ఇదంతా గతం ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. రాజశేఖర్‌కు సినిమాల పరంగా గ్యాప్ వచ్చింది. ఇటీవలే ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న గరుడవేగలో నటిస్తున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌ను మళ్లి గాడిలో పెడుతుందని నమ్ముతున్నారు. సినిమాకు హైప్ తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారు. టీజర్ విడుదలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. ఇటీవలే చిరంజీవిని సైతం స్వయంగా కలిశారు. గరుడవేగ ట్రైలర్స్ బావున్నాయంటూ చిరు ప్రశంసించారు. ఇద్దరు రాజకీయాలు మాట్లాడుకోలేదు. పాత స్నేహాన్ని కొనసాగిస్తూ సరదాగా మాట్లాడుకున్నారు.
రాజకీయాల్లో మాదిరిగానే సినిమారంగంలో కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల మనస్పర్ధలు తలెత్తి దూరమైన వాళ్ళు మళ్ళీ కలుసుకున్న సందర్భాలున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ దంపతుల మధ్య స్నేహం చిగురించింది. ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళితే…. చిరంజీవి పార్టీ పెట్టకముందు రాజశేఖర్ చేసిన కామెంట్స్ వివాదమయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై చిరు అభిమానులు దాడి చేశారు. దాంతో రాజశేఖర్, జీవిత తీవ్రంగా ఆగ్రహించారు. చిరంజీవిపై విమర్శల దాడి చేశారు. అదే సందర్భంలో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి పలకరించారు

Comments
Post a Comment