నిన్న మ్యాచ్ లో కోహ్లీ 198* మీద ఉన్నప్పుడు కేరింగ్ చూపించిన రోహిత్ శర్మ | కోహ్లీ అయితే నవ్వుతూనే ఉన్నాడు

నిన్న మ్యాచ్ లో కోహ్లీ 198* మీద ఉన్నప్పుడు కేరింగ్ చూపించిన రోహిత్ శర్మ | కోహ్లీ అయితే నవ్వుతూనే ఉన్నాడు 
శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. శ్రీలంకతో జరిగే మూడో టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు సెలక్టర్లు టీమ్‌ను సోమవారం (నవంబర్ 27) సాయంత్రం ప్రకటించారు. వన్డే సిరీస్‌కు కోహ్లి అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చారు.
మిగతా టీమ్‌లో పెద్దగా మార్పులు లేవు. మూడో టెస్ట్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో శిఖర్ ధావన్ తిరిగొచ్చాడు. విజయ్ శంకర్‌ను కూడా టీమ్‌లో కొనసాగిస్తూనే.. సిద్ధార్థ్ కౌల్‌కు కొత్తగా జట్టులో అవకాశం ఇచ్చారు.తనకు విశ్రాంతి కావాలని అనిపించినప్పుడు కచ్చితంగా బీసీసీఐని అడుగుతానని విరాట్ కోహ్లీ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన విరాట్.. తానేమీ రోబోను కాదని, తన చర్మం, మెడను కోస్తే రక్తమే వస్తుందని వ్యాఖ్యానించాడు.

‘ఆటగాళ్లంతా ఏడాదికి 40 మ్యాచ్‌లు ఆడతారు. ఒక్కో ఆటగాడి ఆట ఒక్కో విధంగా ఉంటుంది. క్రీజులో నిలిచే సమయం, వేసే ఓవర్ల సంఖ్య అందరికీ ఒకేలా ఉండదు. టెస్టుల్లో పుజారా లాంటి ఆటగాళ్లు ఎక్కువ గంటల పాటు క్రీజులోనే ఉంటారు. అటాకింగ్ గేమ్ ఆడే వారిని పుజారాతో ఎలా పోలుస్తాం. మైదానంలో ఎక్కువగా కష్టపడేవారికి కచ్చితంగా రెస్ట్ అవసరం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.


Comments