తెలుగు సీరియల్స్ లో జరిగే గోల ఇది | ఒక్క రోజులో 10 లక్షల మంది చూసారు. వామ్మో వీళ్ళు మామూలోళ్లు కాదు

తెలుగు సీరియల్స్ లో జరిగే గోల ఇది | ఒక్క రోజులో 10 లక్షల మంది చూసారు. వామ్మో వీళ్ళు మామూలోళ్లు కాదు 
తెలుగు టీవీ చానల్స్ లో సీరియల్స్ ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీవీ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ సహాయనిరాకరణ బాట పట్టబోతోంది. వేతనాలు పెంచాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆగస్టు 3వ తేది నుంచి షూటింగ్ కు వెళ్లబోమని ప్రకటించింది.టీవీ ఫెడరేషన్ లోని అనుబంధ సంఘముల కార్మికులు, సాంకేతిక నిపుణుల వేతనాలు పెంచమంటూ ‘తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ను పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 3వ తేదీ నుంచి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించింది. వేతనాలతోపాటు తమకు టైమింగ్ నిర్ణయించాలని టీవీ ఫెడరేషన్ కోరుతూ వస్తోంది. 
అయితేతమకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక నిరసన కార్యక్రమాల్లోకి దిగాలని టీవీ ఫెడరేషన్ లోని 14 శాఖల కార్మికులు యోచిస్తున్నారు.ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో టీవీ ఫెడరేషన్ లోని అన్ని శాఖల కార్మికులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తవించారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మెన్ మేచినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. టెలివిజన్ కార్మికులకు 20 ఏళ్ల నుంచి వేతన సవరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీ వేతనం కంటే తక్కువ ఉందన్నారు. సరైనా టైమింగ్ లేదని, కార్మికులు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు పని చేస్తున్నారని తెలిపారు. ‘తెలుగు టెలివిజన్

Comments