ఈ ప్రమాదం చూస్తే నిద్ర కూడా పట్టదు | బస్సు డ్రైవర్ మరి ఇలా నడిపితే రోడ్ మీద ఎవరు తిరగలేరు

ఈ ప్రమాదం చూస్తే నిద్ర కూడా పట్టదు | బస్సు డ్రైవర్ మరి ఇలా నడిపితే రోడ్ మీద ఎవరు తిరగలేరు 

హైదరాబాద్: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్ధ సేఫ్ రోడ్స్ కార్యక్రమాన్ని నగరంలోని జెఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించింది. హైదరాబాద్ లో 2015 సంవత్సరం ప్రారంభం నుండి 2016 మే వరకు 3,488 యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సాయంతో ప్రజలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు సరైన రోడ్ సేఫ్టీ లేకపోవడం వల్లే జరుగుతుందని వారు తెలియజేశారు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు జీహెచ్‌ఎంసీ సహకారంతో చేపడుతున్న పలు చర్యలతో ఈ ఏ డాది ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రిపీటెడ్‌గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాటికి బ్లాక్ స్పాట్స్‌గా పేరుపెట్టారు. అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలను విశ్లేషించి, లోపాలను సరిదిద్దే ప్రణాళికను అమలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 85 ప్రాంతా ల్లో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించిన అధికారులు ఇప్పటికే 50 చోట్ల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. గత ఏ డాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రోడ్డు ప్రమదాల్లో మరణించిన వారి సంఖ్య 308 ఉండగా, ఈ ఏడాది 225కు తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 83 మరణాలు తగ్గుముఖం పట్టాయి. 

Comments